Share News

శ్వేతసౌధంపై ‘డ్రోన్‌ పోర్టు’!

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:06 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధం భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా మరో కీలక ప్రతిపాదన చేశారు. శ్వేతసౌధంలో నిర్మిస్తున్న భారీ బాల్‌రూమ్‌ పైభాగంలో ప్రత్యేకంగా డ్రోన్‌ పోర్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

శ్వేతసౌధంపై ‘డ్రోన్‌ పోర్టు’!
white house

  • ట్రంప్‌ కొత్త బాల్‌రూమ్‌పై డ్రోన్ల స్థావరం ఏర్పాటు యోచన

వాషింగ్టన్‌, సెప్టెంబరు 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధం భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా మరో కీలక ప్రతిపాదన చేశారు. శ్వేతసౌధంలో నిర్మిస్తున్న భారీ బాల్‌రూమ్‌ పైభాగంలో ప్రత్యేకంగా డ్రోన్‌ పోర్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వైట్‌హౌస్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ట్రంప్‌ చెబుతున్నారు. ఈ పోర్టులో క్షిపణులను మోసుకెళ్లగల మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), సాయుధ సిబ్బంది ఉండాలని ట్రంప్‌ భావిస్తున్నారు. శ్వేతసౌధం 18 ఎకరాల ప్రాంగణంతోపాటు వాషింగ్టన్‌ నగర భద్రతకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. అయితే, ట్రంప్‌ ప్రతిపాదిస్తున్న డ్రోన్‌ పోర్టుకు కొన్ని వందల అడుగుల దూరంలోనే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఇప్పటికే మరో డ్రోన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఈ డ్రోన్లు ఆయుధరహితమైనవి. ‘డ్రోన్‌ యాజ్‌ ఫస్ట్‌ రెస్పాండర్‌’ విధానంలో ఇవి ఎగిరే కెమెరాల్లా పనిచేస్తాయి.

Updated Date - Sep 24 , 2026 | 04:11 AM