యుద్ధం గెలిచేశాం
ABN , Publish Date - Mar 26 , 2026 | 06:02 AM
ఇరాన్‌పై యుద్ధంలో తాము గెలిచేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఒప్పందం కోసం ప్రయత్నిస్తోందని, తాము...
ఇరాన్ ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది
ఇరాన్‌లో సరైన వ్యక్తులతోనే సంప్రదింపులు: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, మార్చి 25: ఇరాన్‌పై యుద్ధంలో తాము గెలిచేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఒప్పందం కోసం ప్రయత్నిస్తోందని, తాము ఎప్పటికీ అణ్వస్త్రాలను సమకూర్చుకోబోమని హామీ ఇచ్చిందని చెప్పారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇరాన్ వద్ద నౌకాదళం లేదు. వాయుసేన లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థలు లేవు. వారి వద్ద ఉన్న ప్రతీదీ పోయింది. మా విమానాలు టెహ్రాన్ మీద స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. వారు పూర్తిగా ఓడిపోయారు. మేం గెలిచేశాం’’ అని పేర్కొన్నారు. గెలిచినప్పుడు చర్చలు ఎందుకు జరుపుతున్నారని మీడియా ప్రశ్నించగా... ఇరాన్ ఒక పెద్ద బహుమతిని ఇచ్చిందని, అది చాలా డబ్బుతో కూడుకున్నదని చెప్పారు. అది గ్యాస్, చమురుకు, హోర్ముజ్ జలసంధికి సంబంధించినదని పేర్కొన్నారు. దీనిని బట్టి తాము ఇరాన్‌లో సరైన వ్యక్తులతోనే సంప్రదింపులు జరుపుతున్నామనే సంకేతాలు అందాయని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్