Share News

ఇరాన్‌పై యుద్ధం నా ఒత్తిడి ఫలితమే: ట్రంప్‌

ABN , Publish Date - Mar 05 , 2026 | 06:16 AM

ఇజ్రాయెల్‌ ఒత్తిడితోనే ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా మొగ్గు చూపిందన్న వాదనను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. దీనికి భిన్నంగా, అది తన ఒత్తిడి ఫలితమేనని ఆయన వ్యాఖ్యానించారు...

ఇరాన్‌పై యుద్ధం నా ఒత్తిడి ఫలితమే: ట్రంప్‌

  • ఇజ్రాయెలే అమెరికాను యుద్ధంలోకి లాగిందనే అర్థం వచ్చేలా అమెరికా రక్షణ మంత్రి రుబియో విరుద్ధ ప్రకటన

వాషింగ్టన్‌, మార్చి 4 : ఇజ్రాయెల్‌ ఒత్తిడితోనే ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా మొగ్గు చూపిందన్న వాదనను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. దీనికి భిన్నంగా, అది తన ఒత్తిడి ఫలితమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ సైనిక చర్య తర్వాత ఇరాన్‌ వైపు నుంచి ప్రతీకార దాడులు ఉంటాయనే అంచనాకు అనుగుణంగానే తాము వ్యవహరించామంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో చేసిన ప్రకటన ప్రతిపక్షాలతోపాటు ‘అమెరికా ఫస్ట్‌’ భావజాల మిత్రుల్లో సైతం దుమారం రేపుతోంది. సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌, జనరల్‌ డాన్‌ కైనే సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తన మంత్రి ప్రకటనను ట్రంప్‌ పరోక్షంగా తోసిపుచ్చారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ సైనిక చర్యకు దిగడంతో అమెరికా కూడా అదే దారి ఎంచుకోవాల్సి వచ్చిందనేది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ‘‘హింసను నివారించడం కోసం నేను చేసిన చర్చల ప్రతిపాదనను ఇరాన్‌ పట్టించుకోలేదు. దాడికి ఆ దేశం సిద్ధమవుతోందని నాకర్థం అయింది. తొలి దాడి మేం చేయకపోతే, ఆ పని కచ్చితంగా ఇరాన్‌ చేసేది’’ అని ఆయన వివరించారు. కాగా, రుబియో ప్రకటన పట్ల అధ్యక్ష కార్యాలయ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధం ఇజ్రాయెల్‌ భద్రతా ప్రయోజనాల కోసమే తప్ప అమెరికా ప్రయోజనాల కోసం కాదనే అభిప్రాయం ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా అందరిలో ఉంది. రుబియో ప్రకటన ఈ సందేహాలకు మరింత బలం చేకూర్చిందని ఆ వర్గాలు మండిపడుతున్నాయి. ఇంకోవైపు, రూబియో ప్రకటనను ఇరాన్‌ కూడా రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఇజ్రాయెల్‌ తరఫున అమెరికా రంగంలోకి దిగిందనే వాస్తవం ఈ ప్రకటనతో తేలిపోయిందని నిజానికి, ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఒత్తిడి ట్రంప్‌పై బలంగా ఉన్నదనే భావన సర్వత్రా ఉంది. ఇరాన్‌తో తలపడాలంటూ అమెరికాను ఆయన తరచూ రెచ్చగొడుతున్నారు.

ఇవీ చదవండి:

ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..

జీడీపీకి చమురు సెగ

Updated Date - Mar 05 , 2026 | 06:16 AM