ఊయలే ఉరితాడైంది!
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:31 AM
సరదాగా ఆడుకోంటున్న బాలిక ఊహించని పరిణామంతో మృత్యువాతపడింది. ఉయ్యాలే ఉరితాడై చిన్నారి ప్రాణం తీసింది.
ఆడుకుంటూ చిన్నారి మృత్యువాత
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సరదాగా ఆడుకోంటున్న బాలిక ఊహించని పరిణామంతో మృత్యువాతపడింది. ఉయ్యాలే ఉరితాడై చిన్నారి ప్రాణం తీసింది. విశాఖపట్టణం మర్రిపాలెం ప్రాంతానికి చెందిన దంపతులు సౌదీ అరేబియా రియాధ్ నగరంలో బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు, వీరికి ఐదు, పది సంవత్సరాల వయస్సున్న ఇద్దరు ఆడపిల్లలు. తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఉయ్యాల తాడు గొంతుకు బిగుసుకుని అచేతనంగా పడి ఉన్న పెద్దకుమార్తెను చూసి షాక్‌కు గురయ్యారు. హుటహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణం దక్కలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..