Share News

Fortune Teller Arrested: జ్యోతిష్యం నిజం చేయడానికి బరితెగించిన జ్యోతిష్యుడు.. ఏం చేసిందంటే..

ABN , Publish Date - Jan 04 , 2026 | 07:10 AM

ఓ జ్యోతిష్యుడు తాను చెప్పింది నిజం చేయడానికి దొంగగా మారాడు. తన క్లైంట్ ఫోన్‌ను దొంగిలించాడు. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో న్యూఇయర్ రోజున జరిగింది.

Fortune Teller Arrested: జ్యోతిష్యం నిజం చేయడానికి బరితెగించిన జ్యోతిష్యుడు.. ఏం చేసిందంటే..
Fortune Teller Arrested

మన భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోవటానికి సాధారణంగా జ్యోతిష్యులను ఆశ్రయిస్తూ ఉంటాము. జ్యోతిష్యులు వారి పద్దతుల్లో మనకు జ్యోష్యం చెబుతూ ఉంటారు. వారు చెప్పిన జ్యోతిష్యం కొన్నిసార్లు నిజం అవ్వవచ్చు.. కొన్నిసార్లు కాకపోవచ్చు. జ్యోతిష్యులు చెప్పింది నూటికి నూరు శాతం నిజం అవ్వాలన్న రూలేమీ లేదు. తాజాగా, ఓ జ్యోతిష్యుడు తాను చెప్పింది నిజం చేయడానికి దొంగగా మారాడు. తన క్లైంట్ ఫోన్‌ను దొంగిలించాడు. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో న్యూఇయర్ రోజున జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సౌత్ పటాయాకు చెందిన 19 ఏళ్ల పిమ్ అనే యువతి తన భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోవటానికి న్యూ ఇయర్ రోజున 38 ఏళ్ల జ్యోతిష్యుడు ఉడోమ్ సాప్ మ్యూంగ్‌కాయూ దగ్గరకు వెళ్లింది. యువతిని దురదృష్టం వెంటాడనుందని ఉడోమ్ చెప్పాడు. దురదృష్టం కలగకుండా చేయాలంటే తనకు కొంత డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఇందుకు పిమ్ ఒప్పుకోలేదు. దీంతో ఉడోమ్ ఆగ్రహానికి గురయ్యాడు. తన జ్యోతిష్యం నిజం చేయడానికి పిమ్‌కు చెందిన ఐఫోన్‌ను దొంగిలించాడు. అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత పిమ్ ఐఫోన్ తన దగ్గర లేకపోవటాన్ని గుర్తించింది.


జ్యోతిష్యం చెప్పించుకున్న చోట ఫోన్ మర్చిపోయిన సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లింది. అక్కడ కూడా ఫోన్ కనిపించలేదు. పిమ్ తన ఫోన్ గురించి ఉడోమ్‌ను అడిగింది. అతడు తనకు తెలీదని చెప్పాడు. దీంతో పిమ్ అటువైపు వెళుతున్న వారి సాయం తీసుకుంది. జరిగింది మొత్తం వారికి చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఉడోమ్ బ్యాగులో ఐఫోన్‌ను గుర్తించారు. చెప్పిన జ్యోతిష్యం నిజం చేయడానికే తాను అలా చేసినట్లు ఉడోమ్ చెప్పాడు. ఇక, పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి

ల్యాండ్ పూలింగ్ రైతులు అధైర్యపడొద్దు.. అన్ని హామీలు నెరవేరుస్తాం: నారాయణ

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 04 , 2026 | 07:31 AM