ఇరాన్ రాజధాని నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం
ABN , Publish Date - Apr 25 , 2026 | 02:46 PM
టెహ్రాన్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు శనివారం పునఃప్రారంభం అయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలను ముగించేలా పాక్‌లో మలివిడత శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు చల్లార్చేందుకు పాక్‌లో మలివిడత చర్చలు ప్రస్తుతం జరుగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ అలీ ఖమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. యూఎస్, ఇజ్రాయెల్ దాడులు మొదలైన తరువాత ఈ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమైనట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇస్తాంబుల్, మస్కట్, మదీనాలకు విమానాలు శనివారం బయలుదేరి వెళ్లాయి.
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఇస్లామాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. యూఎస్‌తో నేరుగా చర్చలు జరపబోమని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మలివిడతలో ఇరాన్ బృందం రెండు సార్లు పాక్ మిలిటరీ, రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపింది. పాక్ ద్వారా పరోక్షంగా యూఎస్‌తో చర్చలు జరుపుతోంది. ఇక ఈ రోజు అమెరికా ప్రతినిధులు కూడా ఇస్లామాబాద్‌కు వెళ్లే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి
ఆ సడలింపులను కొనసాగించబోము.. యూఎస్ మంత్రి స్పష్టీకరణ
యూఎస్‌తో నేరుగా చర్చలు ఉండవు: ఇరాన్