Share News

చైనా గ్లాస్ బ్రిడ్జిపై బాలుడి పిచ్చి పని.. గొడుగుతో ఓ అద్దాన్ని..

ABN , Publish Date - Jul 01 , 2026 | 02:43 PM

పర్యాటకులకు ఎంతో థ్రిల్‌ను అందిస్తున్న చైనా, బావోక్వాన్ క్లిఫ్ వరల్డ్ సీనిక్ ఏరియాలోని గ్లాస్ బ్రిడ్జిపై ఓ బాలుడు పిచ్చి పని చేశాడు. తన వెంట తెచ్చుకున్న గొడుగుతో ఓ అద్దాన్ని పగులగొట్టాడు. దీంతో ఆ బ్రిడ్జిపై కలకలం మొదలైంది.

చైనా గ్లాస్ బ్రిడ్జిపై బాలుడి పిచ్చి పని.. గొడుగుతో ఓ అద్దాన్ని..
China glass bridge

బీజింగ్, జులై 1: చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బావోక్వాన్ క్లిఫ్ వరల్డ్ సీనిక్ ఏరియా ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ బ్రిడ్జిని చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులతో ఆ బ్రిడ్జి ప్రతినిత్యం నిండుగా.. ఎంతో సందడిగా ఉంటుంది. పర్యాటకులు బ్రిడ్జి మీద అటు, ఇటు తిరిగి అద్భుతమైన అనుభవాలను పోగేసుంటున్నారు.


పర్యాటకులకు ఎంతో థ్రిల్‌ను అందిస్తున్న గ్లాస్ బ్రిడ్జిపై ఓ బాలుడు పిచ్చి పని చేశాడు. తన వెంట తెచ్చుకున్న గొడుగుతో ఓ అద్దాన్ని పగులగొట్టాడు. దీంతో ఆ బ్రిడ్జిపై కలకలం మొదలైంది. గ్లాస్ బ్రిడ్జి సిబ్బంది వెంటనే స్పందించారు. బ్రిడ్జిపై ఉన్న వారిని అక్కడినుంచి పక్కకు తీసుకువచ్చారు. జూన్ 20వ తేదీన చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


గ్లాస్ బ్రిడ్జి అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. గ్లాస్ బ్రిడ్జిలోని ప్యానెల్స్ ప్రత్యేకంగా డిజైన్ అయ్యాయి. ఆ ప్యానెల్స్ కొన్ని వేల కిలోల బరువును మోయగలవు. ఒకేసారి వందకుపైగా మంది ఆ బ్రిడ్జిపై తిరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతీ ప్యానెల్‌కు మూడు లేయర్ల రక్షణ ఉంటుంది. బాలుడు గొడుగుతో పదే పదే పొడవగా.. ఒక గ్లాస్ ప్యానెల్‌లోని ఒక లేయర్ మాత్రమే పగిలిపోయింది. కింది భాగంలోని రెండు లేయర్లకు ఎలాంటి నష్టం కలగలేదు. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను బ్రిడ్జి మీద నుంచి పక్కకు తీసుకువచ్చారు. పగిలిపోయిన గ్లాస్ ప్యానెల్ స్థానంలో కొత్త దాన్ని రీప్లేస్ చేయడానికి తయారీదారులను సంప్రదించారు.


ఇవి కూడా చదవండి

పని ఒత్తిడి సంతానోత్పత్తిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి

Updated Date - Jul 01 , 2026 | 03:36 PM