బికినీల్లో ఉన్న మహిళల మధ్య స్టీఫెన్ హాకింగ్! వివరణ ఇచ్చిన శాస్త్రవేత్త కుటుంబం
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:50 PM
బికినీలు ధరించి ఉన్న ఇద్దరు మహిళల మధ్య శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూర్చొన్న ఫొటో వైరల్‌గా మారింది. దీనిపై ఆయన కుటుంబం వివరణ ఇచ్చింది. ఆ ఇద్దరూ కేర్‌టేకర్లు అని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన ఫైల్స్ రేపుతున్న కలకలం కొనసాగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తున్న ఫైల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దివంగత బ్రిటీష్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా ఈ ఫైల్స్‌లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన స్టీఫెన్ హాకింగ్ ఫొటో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. దీంతో, ఆయన కుటుంబం కూడా స్పందించాల్సి వచ్చింది.
బికినీలు ధరించి ఉన్న ఇద్దరు మహిళల మధ్య స్టీఫెన్ హాకింగ్ కూర్చుని ఉన్న ఫొటో ఇది. లాంజ్ చెయిర్‌లో కూర్చుని ఆయన రిలాక్స్ అవుతున్నట్టు ఫొటోలో కనిపించింది. స్టీఫెన్ తల పక్కకు వాలిపోకుండా ఓ మహిళ పట్టుకున్నట్టు ఫొటోలో ఉంది. స్విమ్మింగ్ పూల్ వద్ద లేదా ఏదైనా రిసార్ట్ వద్ద ఈ ఫొటో తీసి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. అయితే, ఈ ఫొటోకు సంబంధించిన వివరాలేవీ విడుదల కాలేదు.

ఈ నేపథ్యంలో స్టీఫెన్ హాకింగ్ కుటుంబం స్పందించింది. ఫొటో విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావు లేదని పేర్కొంది. ఫొటోలోని ఇద్దరు మహిళలు స్టీఫెన్ హాకింగ్ సహాయకులని వివరించింది. ఫొటోలోని ఇద్దరు మహిళలు అప్పటికే స్టీఫెన్ హాకింగ్ వద్ద సంరక్షకులుగా చాలా కాలంగా పనిచేస్తున్నారని ఆయన కుటుంబ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి:
భారత్ విషయంలో వెనక్కు తగ్గిన కెనడా!
అది విచారకరం.. భారత బడ్జెట్‌పై ఇరాన్ ఆర్థిక మంత్రి కామెంట్