సిమోన్ ఆండ్రిజ్ అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:24 AM
అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌కు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు మధ్య ఉన్న సంబంధాల్ని బయటపెట్టిన వేగు సిమోన్ ఆండ్రిజ్(57) ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
ఎప్‌స్టీన్‌తో అమెరికా మంత్రి
లుట్నిక్ సంబంధాలను
బయటపెట్టిన సిమోన్
లండన్: అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌కు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు మధ్య ఉన్న సంబంధాల్ని బయటపెట్టిన వేగు సిమోన్ ఆండ్రిజ్(57) ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సిమోన్ మృతిని ఆయన గతంలో పనిచేసిన ట్రాన్స్‌ఫరన్సీ టాస్క్‌ఫోర్స్ వ్యవస్థాపకుడు ఆండీ నిర్ధారించారు. బ్రిటన్ మాజీ బ్యాంకర్ అయిన సిమోన్ గతంలో లుట్నిక్‌కు చెందిన సంస్థలో పనిచేశారు. ఈ క్రమంలో 2018లో ఎప్‌స్టీన్‌తో లుట్నిక్‌కు ఉన్న వ్యాపార, ఇతర సంబంధాల్ని అమెరికన్ కాంగ్రె్‌సకు వెల్లడించారు. దీనిపై దుమారం రేగడంతో ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలను లుట్నిక్ కొంతమేర అంగీకరించారు. ఈ మేరకు ఈ ఏడాది ఆరంభంలో అమెరికా కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.