Share News

ప్రపంచంలో తొలిసారి మనిషికి షామోండా వైరస్‌

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:42 AM

ఇప్పటి వరకు పశువులకే పరిమితమనుకున్న షామోండా వైరస్‌ ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి సోకింది.

ప్రపంచంలో తొలిసారి మనిషికి షామోండా వైరస్‌

  • ఫ్రాన్స్‌లో వైరస్‌ బారిన పడి మరణించిన వృద్ధుడు

ప్యారిస్‌, అక్టోబర్‌ 22: ఇప్పటి వరకు పశువులకే పరిమితమనుకున్న షామోండా వైరస్‌ ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి సోకింది. ఫ్రాన్స్‌లో మరణించిన 60 ఏళ్ల వృద్ధుడిలో ఈ వైర్‌సను గుర్తించారు. లియోన్‌లో ఈ నెల మొదట్లో తీవ్ర అనారోగ్యం, వ్యాధి నిరోధకత బలహీనపడిన పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో బాధితుడికి ఈ వైరస్‌ సోకినట్లు బయటపడింది. ఇది అసాధారణమైన కేసు అని, అయితే ప్రజారోగ్యానికి ఎలాంటి రిస్క్‌ లేదని ఫ్రాన్స్‌ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ సంక్రమణం పశువులు, మేకలు, గొర్రెల్లోనే పరిమితం కావడం గమనార్హం. కొలికోయిడస్‌ అనే జాతికి చెందిన కీటకం కుడితే ఈ వైరస్‌ సోకుతుంది.

Updated Date - Oct 23 , 2026 | 03:44 AM