పుతిన్ మా పైసలు తీసేసుకుంటాడేమో..!
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:27 AM
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాలోని పెద్ద పెద్ద కంపెనీల ఆస్తులను పుతిన్ సర్కారు జప్తు చేస్తుండడంతో.. రష్యన్లలో కొత్త భయం మొదలైంది. తమ బ్యాంకు ఖాతాల్లో..
ఖాతాల నుంచి నగదును తీసేసుకుంటున్న రష్యా ప్రజలు
మాస్కో, ఆగస్టు 19: ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాలోని పెద్ద పెద్ద కంపెనీల ఆస్తులను పుతిన్ సర్కారు జప్తు చేస్తుండడంతో.. రష్యన్లలో కొత్త భయం మొదలైంది. తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును సైతం ఎక్కడ తీసేసుకుంటుందోనన్న ఆందోళనతో వారు ముందు జాగ్రత్త చర్యగా తమ డబ్బును ఉపసంహరించేసుకుంటున్నారు. గడిచిన ఏడు నెలలుగా బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రాయల్స్ కొనసాగుతుండగా.. ఆగస్టులో ఉపసంహరణల ఉధృతి బాగా పెరిగిపోయింది. ఈ నెల మొదటి రెండువారాల్లోనే 286.4 బిలియన్ రూబుళ్ల (రూ.32వేల కోట్ల) నగదును తీసేసుకున్నారు. అందులో రూ.6,400 కోట్లకు పైగా సొమ్మును ఆగస్టు 12నే విత్‌డ్రా చేయడం గమనార్హం. జూలై నెల మొత్తం కలిపి రష్యన్లు విత్‌డ్రా చేసిన సొమ్ము మన కరెన్సీలో రూ.70వేల కోట్లకు పైమాటే.