Share News

కుప్పకూలిన రష్యా బాంబర్ విమానం.. ఆరుగురి మృతి!

ABN , Publish Date - Sep 29 , 2026 | 09:00 PM

రష్యాకు చెందిన అత్యంత శక్తిమంతమైన బాంబర్ విమానం కుప్పకూలింది. విమాన శిక్షణ నిర్వహించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఒకరు మినహా, మిగతా ఆరుగురు సిబ్బంది మృతి చెందారు.

కుప్పకూలిన రష్యా బాంబర్ విమానం.. ఆరుగురి మృతి!
Russian Tu-95 Bomber Crashes in Amur Region, Six Crew Members Killed

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 29: రష్యాకు చెందిన అత్యంత శక్తిమంతమైన టీయూ-95 (Tu-95) బాంబర్ విమానం తూర్పు ప్రాంతమైన అముర్ (Amur) రీజియన్‌లో కుప్పకూలింది. ఇవాళ విమాన శిక్షణ నిర్వహించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బంది మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.


అముర్ ప్రాంతంలోని క్రాస్నోయారోవో (Krasnoyarovo) గ్రామం వద్ద టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే నిర్జన ప్రదేశంలో కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం ఇంధన ట్యాంకర్లు పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో మొత్తం ఏడుగురు ప్రయాణించగా, ఆరుగురు మరణించారు (ఇందులో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు). గాయపడిన మరో క్రూ మెంబర్‌ను చికిత్స నిమిత్తం అత్యవసరంగా తరలించారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి రష్యా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలనూ చదవండి:

చమురు సలసల.. మార్కెట్‌ విలవిల

లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణ

Updated Date - Sep 29 , 2026 | 09:03 PM