మరో ఘటన.. కుప్పకూలిన రష్యన్ Tu-22M3 యుద్ధ విమానం..
ABN , Publish Date - Jun 16 , 2026 | 10:28 AM
రష్యాకు చెందిన Tu-22M3 యుద్ధ విమానం కుప్పకూలింది. సోమవారం ఫ్లైట్ ట్రైనింగ్ సందర్భంగా సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విమాన ప్రమాదాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: రష్యాకు చెందిన Tu-22M3 యుద్ధ విమానం కుప్పకూలింది. సోమవారం ఫ్లైట్ ట్రైనింగ్ సందర్భంగా సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విమాన ప్రమాదాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నారు. ఆ విమానం అంగారా నది సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలగానే దట్టమైన పొగ మొదలైంది. లోపల ఉన్న నలుగురు సిబ్బంది వెంటనే బయటకు వచ్చేశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
ఆ విమానం కామెంకా గ్రామానికి సమీపంలో కూలిపోయిందని ఇర్కుట్స్క్ గవర్నర్ ఇగోర్ కొబ్జెవ్ తెలిపారు. ఘటనా స్థలంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారని వెల్లడించారు. స్వల్ప గాయాలపాలైన నలుగురు సిబ్బందిని ఆసుపత్రికి తరలించారని ఆయన పేర్కొన్నారు. ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విమానంలో యుద్ధ సామాగ్రి లేకపోవటంతో భూమిపై పెద్దగా ప్రభావం పడలేదన్నారు.
కాగా, Tu-22M3 సోవియట్ కాలం నాటి సూపర్‌సోనిక్ బాంబర్ విమానం. దీన్ని సిరియా, ఉక్రెయిన్ దేశాలతో జరిగిన యుద్ధాలలో రష్యా ఉపయోగించింది. ఎంతో చరిత్ర కలిగిన ఈ బాంబర్ విమానం.. ఫ్లైట్ ట్రైనింగ్ సందర్భంగా కుప్పకూలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాల తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్..
అమెరికా సైన్యానికి చెందిన బీ-52 బాంబర్ సోమవారం ఉదయం ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని మిలటరీ ఎయిర్‌బేస్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో భోజన విరామం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి
కృష్ణా నదీ తీరాన ‘యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులు
జీవితంలో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణాలివే