చైనాకు కాకుండా భారత్‌కు.. రష్యా ఆయిల్ ట్యాంకర్ దిశ మార్చుకుందా..
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:47 PM
చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు ట్యాంకర్ అక్వా టైటాన్ దిశ మార్చుకుని భారత్ వైపు వెళ్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అది దిశ మార్చుకుందని సమాచారం.
చైనాకు చేరుకోవాల్సిన రష్యా చమురు ట్యాంకర్ 'అక్వా టైటాన్' దిశ మార్చుకుని భారత్ వైపు వెళ్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అది దిశ మార్చుకుందని సమాచారం. అయితే ఆ ట్యాంకర్‌కు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారమూ లేదని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా వెల్లడించారు (Russian oil tanker India).
జనవరి నెల చివరి వారంలో బాల్టిక్ సీ పోర్ట్‌లో ఈ ట్యాంకర్‌లోకి చమురు లోడ్ అయిందని, ఇది చైనాలోని రిజావో పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉందని సమాచారం. అయితే దక్షిణ చైనా సముద్రంలో దిశ మార్చుకున్న ఈ ట్యాంకర్ మార్చి 21వ తేదీ నాటికి కర్ణాటకలోని న్యూ మంగుళూరు పోర్ట్‌కు చేరుకోబోతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా పెంచింది. ఈ నేపథ్యంలోనే చైనాకు వెళ్లాల్సిన ఇంధన ట్యాంకర్ భారత్ వైపు మళ్లిందని మీడియాలో కథనాలు వచ్చాయి (Russia oil exports India).
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు సడలించిన సంగతి తెలిసిందే (India crude oil supply). దీంతో జపాన్, దక్షిణ కొరియా వంటి పలు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా పెంచాయి. భారత్ కూడా రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచింది. ఆమెరికా ఆంక్షలు సడలించిన తర్వాత రష్యా నుంచి భారత్ రిఫైనరీలు 30 మిలియన్ల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..