Share News

ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేసే దిశగా రష్యా

ABN , Publish Date - Aug 27 , 2026 | 09:04 PM

ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో పురోగతి లేని నేపథ్యంలో దాడులను మరింత తీవ్రతరం చేసే యోచనలో ఉన్నట్టు రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేసే దిశగా రష్యా
Russia Ukraine war

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా నిన్న రాత్రి బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. నేటి ఉదయం వరకూ దాడులు కొనసాగాయి. ఉక్రెయిన్ నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఆయిల్ రిఫైనరీలు, సరకు రవాణా హబ్‌లపై మిసైల్ దాడులు చేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అయితే, పౌర నివాస సముదాయాలను కూడా రష్యా టార్గెట్ చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో పురోగతి లేని నేపథ్యంలో దాడులను మరింత తీవ్రతరం చేసే యోచనలో ఉన్నట్టు రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరింత శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడాలన్న యోచనలో రష్యా ఉంది. రాజధాని కియవ్‌ను కూడా టార్గెట్ చేసే దిశగా యోచిస్తోంది.


మిసైల్స్ కొరతతో ఉక్రెయిన్ సతమతం

గగనతల రక్షణ కోసం వినియోగించే పాట్రియట్ మిసైల్స్ కొరత తలెత్తడంతో ఉక్రెయిన్ చిక్కుల్లో పడింది. అమెరికా ఈ మిసైల్స్‌ను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తోంది. అయితే, రష్యా మాత్రం తన మిసైల్ నిల్వలను పెంచుకుంటోందని ఉక్రెయిన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ గగతనల రక్షణ వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేసేలా క్రమం తప్పకుండా దాడులు చేస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఐరోపాను అభ్యర్థించారు. ఇదిలా ఉంటే రష్యాలోని ప్రముఖ నగరమైన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఓ కారు పేలడంతో ఓ సైనికాధికారి, ఆయన భార్య కన్నుమూశారు. ఘటనకు కారణం ఇంకా తెలియరాలేదు.


ఈ వార్తలనూ చదవండి:

నేపాల్‌కు చైనా అలర్ట్.. మరో ఉపద్రవం ముంచుకొస్తోందా?

మాపై నిందలేస్తే ఉపయోగం ఉండదు: నేపాల్‌కు తేల్చి చెప్పిన చైనా

Updated Date - Aug 27 , 2026 | 09:17 PM