రష్యా, ఉక్రెయిన్‌లు అందుకు అంగీకరించాయి: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Sep 14 , 2026 | 10:27 PM
ఇంధన రంగ మౌలిక వసతులపై పరస్పర దాడులను కట్టిపెట్టేందుకు రష్యా, ఉక్రెయిన్‌లు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంధన రంగ మౌలిక వసతులపై పరస్పర దాడులను కట్టిపెట్టేందుకు రష్యా, ఉక్రెయిన్‌లు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. రష్యా ఇంధన రంగ మౌలిక వసతులపై దాడులను కట్టిపెట్టాలని ట్రంప్ అంతకుమునుపు ఉక్రెయిన్‌ను కోరిన విషయం తెలిసిందే.
ట్రంప్ ప్రకటనపై అటు ఉక్రెయిన్, ఇటు రష్యా స్పందించలేదు. బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, ఇంధన రంగ మౌలిక వసతులపై దాడులు ఆపాలన్న ట్రంప్ పిలుపును మాత్రం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ స్వాగతించింది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా డిజీల్ ధరలు పెరగడానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన కారణమని ట్రంప్ అన్నారు. ఇరాన్ యుద్ధం కాదని చెప్పారు.
అమెరికాలో గ్యాలన్ డీజిల్ ధర 6 డాలర్లకు ఎగబాకింది. రష్యా రిఫైనింగ్ కార్యకలాపాల్లో అవాంతరాలు, గల్ఫ్ దేశాల ఎగుమతుల్లో తగ్గుదల కారణంగా డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కూడా పేర్కొంది. ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాలో ముడి చమురు శుద్ధి సామర్థ్యం 30 శాతం మేర తగ్గినట్టు తెలుస్తోంది. ఇంధన వసతులపై దాడులకు ఫుల్ స్టాప్ పడితే ధరలు దిగివస్తాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ అనుకుని నాటో జెట్‌ల హడావుడి.. తీరా చూస్తే..
పాకిస్థాన్ కొత్త నాటకం.! 'రెడ్ బుక్'లో జైషే చీఫ్ మసూద్ అజార్