Share News

ఇదేం స్పీడు ‘రోబో’య్‌!

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:59 AM

చైనాలోని బీజింగ్‌ వేదికగా శనివారం నుంచి ప్రారంభమైన వరల్డ్‌ హ్యుమనాయిడ్‌ రోబో గేమ్స్‌లో అద్భుతం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా స్ర్పింట్‌ దిగ్గజం...

ఇదేం స్పీడు ‘రోబో’య్‌!

బోల్ట్‌ ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన రోబోలు

బీజింగ్‌, ఆగస్టు 23 : చైనాలోని బీజింగ్‌ వేదికగా శనివారం నుంచి ప్రారంభమైన వరల్డ్‌ హ్యుమనాయిడ్‌ రోబో గేమ్స్‌లో అద్భుతం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా స్ర్పింట్‌ దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ నెలకొల్పిన ప్రపంచ రికార్డును రెండు రోబోలు బద్దలుకొట్టాయి. 2009లో బెర్లిన్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసిన బోల్ట్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే, బీజింగ్‌లో జరుగుతున్న పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన ప్రిలిమినరీ హీట్‌లో రెండు రోబోలు బోల్ట్‌ వరల్డ్‌ రికార్డు టైమింగ్‌ కంటే తక్కువ సమయంలో రేసును పూర్తి చేశాయి. బీజింగ్‌ హ్యుమనాయిడ్‌ రోబో ఇన్నోవేషన్‌ సెంటర్‌ రూపొందించిన టియాంగాంగ్‌ అలా్ట్ర అనే రోబో 9.39 సెకన్లలో, హానర్‌ సంస్థ రూపొందించిన లైటనింగ్‌ అనే రోబో 9.47 సెకన్లలో రేసును పూర్తి చేసి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. టియాంగాంగ్‌, లైటనింగ్‌ రెండూ ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు కంటే మెరుగైన టైమింగ్‌ నమోదు చేయడం విశేషం. ఈ పోటీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది.

Updated Date - Aug 24 , 2026 | 06:59 AM