రష్యా సైనికుల నరమాంస భక్షణ!
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:33 AM
ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఆహారం లేక అలమటిస్తున్న రష్యా సైనికులు.. తోటి సైనికులను, సాధారణ ప్రజలను చంపి తింటున్నారన్న వార్తలు...
ఆహారం లేక సహచర సైనికులను చంపి తింటున్నట్లు ‘సండే టైమ్స్’లో కథనం
లండన్, ఏప్రిల్ 27: ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఆహారం లేక అలమటిస్తున్న రష్యా సైనికులు.. తోటి సైనికులను, సాధారణ ప్రజలను చంపి తింటున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ విధమైన నరమాంసభక్షణకు సంబంధించి ఇప్పటి వరకూ కనీసం ఐదు ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఉక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయంటూ బ్రిటన్‌కు చెందిన ‘సండే టైమ్స్’ అనే వార్తా పత్రిక వెల్లడించింది. గత ఏడాది నవంబరులో దొనెట్స్క్ అనే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఓ సైనికుడు.. తన సహచర సైనికులు ఇద్దరిని చంపి, వాళ్లలో ఒక సైనికుడి శవం కాలు నరికివేసి, గ్రైండర్‌లో ముద్ద చేసి తినేందుకు ప్రయత్నించాడని ఈ కథనం వెల్లడించింది. ఈ మేరకు యూనిట్ సైనికాధికారి తన పై అధికారికి వాయిస్ నోట్ రూపంలో నివేదిక పంపాడని తెలియజేసింది. గత ఏడాది అక్టోబరులో ఉదాచ్నె అనే ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ యూనిట్ కమాండర్.. తన కింది సిబ్బందిలో ఒకరితో.. ‘ఉక్రెయిన్లను ఎందుకు తింటున్నావ్? మనుష్యులను తినటం మానెయ్!’ అని అరిచి చెప్పినట్లు తెలిపింది. అయితే, ఈ తరహా వార్తలన్నీ ఉక్రెయిన్ సృష్టించే అబద్ధాలని రష్యా తీవ్రంగా మండిపడింది.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం