24 గంటల్లో 23 వేల కిలోమీటర్లు!
ABN , Publish Date - Jul 30 , 2026 | 05:49 AM
దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. 2005లో హాంకాంగ్ నుంచి బయల్దేరిన బోయింగ్ 777 విమానం ఏకధాటిగా 22 గంటల 42 నిమిషాలపాటు ప్రయాణించి లండన్‌కు చేరింది. పౌర విమానయాన చరిత్రలో...
మెల్‌బోర్న్ నుంచి ఫ్రాన్స్‌కు ఆగకుండా ప్రయాణం
రికార్డు సృష్టించిన క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ టెస్ట్ ఫ్లైట్
మెల్‌బోర్న్, జూలై 29: దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. 2005లో హాంకాంగ్ నుంచి బయల్దేరిన బోయింగ్ 777 విమానం ఏకధాటిగా 22 గంటల 42 నిమిషాలపాటు ప్రయాణించి లండన్‌కు చేరింది. పౌర విమానయాన చరిత్రలో ఒక విమానం అంతసేపు ఏకధాటిగా ప్రయాణించడం అదే.ఆ రికార్డును తాజాగా.. ఆస్ట్రేలియా జాతీయ విమానయాన సంస్థ క్వాంటాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయోగాత్మక ‘ఎయిర్‌బస్ ఏ350-1000యూఎల్‌ఆర్’ విమానం బద్దలుగొట్టింది. స్థానిక కాలమానం ప్రకారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నుంచి జూలై 27 సాయంత్రం 5.37కి బయల్దేరిన ఆ విమానం ఎక్కడా ఆగకుండా.. 23,075 కిలోమీటర్ల దూరం.. 24 గంటల 24 నిమిషాల పాటు ప్రయాణించి ఫ్రాన్స్‌లోని టౌలౌస్ నగరంలో జూలై 28 ఉదయం 9.52 గంటలకు ల్యాండ్ అయ్యింది. 2027 ఏప్రిల్‌కల్లా ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల నుంచి న్యూయార్క్, లండన్ నగరాలకు నాన్‌స్టా్‌ప విమానాలను నడిపే లక్ష్యంతో చేపట్టిన ‘ప్రాజెక్ట్ సన్‌రైజ్’లో భాగంగా క్వాంటాస్ సంస్థ ఈ విమానాన్ని పరీక్షించింది. ఈ ప్రయాణంలో ఇందులో 12 మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఎనిమిది మంది ఎయిర్‌బస్ టెస్ట్ క్రూ కాగా.. ఇద్దరు క్వాంటాస్ పైలట్లు, ఇద్దరు ఎయిర్‌బస్ ఇంజనీర్లు. ఏకధాటిగా ఎక్కువ సమయం ప్రయాణించడానికి వీలుగా ఎయిర్‌బస్ సంస్థ ‘ఏ350-1000యూఎల్‌ఆర్’ విమానాలను ప్రత్యేకంగా తయారుచేస్తోంది. ప్రయాణికులకు జర్నీలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా బిజినెస్ క్లాస్ కన్నా మిన్నగా ఉండే ఫస్ట్‌క్లాస్ సూట్లు కూడా నిర్మించింది.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్