Share News

రష్యా కంపెనీలకు అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్! ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే..

ABN , Publish Date - Aug 26 , 2026 | 09:09 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశంలోని సంస్థలకు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.

రష్యా కంపెనీలకు అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్! ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే..
Putin drone attack warning

ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశంలోని సంస్థలకు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నుంచి తమని తాము రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోని సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇటీవల కాలంలో రష్యాలోని పలు ఆయిల్ రిఫైనరీలు, ఇతర సంస్థలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల నుంచి రక్షించుకునేందుకు గట్టి చర్యలు చేపట్టాలని సంస్థలకు అధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పారు. జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవనాధారాలతో ముడిపడ్డ సంస్థలు అన్నిటికీ ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ఈ నిబంధనలు తక్షణంలో అమల్లోకి వచ్చినట్టు కూడా రష్యా ప్రభుత్వం పేర్కొంది.


కోర్టు అనుమతి అవసరం లేకుండానే రష్యా అధికారులు కంపెనీలను తాత్కాలికంగా తమ నియంత్రణలోకి తీసుకునే అవకాశం ఉంది. మౌఖింగా ఇచ్చే ఆదేశాలు కూడా చెల్లుబాటు అవుతాయని అక్కడి లాయర్లు చెబుతున్నారు. డ్రోన్ దాడులను అడ్డుకునేలా చర్యలు తీసుకోకున్నా, భద్రతా నియమాలను ఉల్లంఘించినా, అధికారుల సూచనల మేరకు సమర్థవంతమైన చర్యలు చేపట్టకున్నా ప్రభుత్వం ఆయా సంస్థలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇది ఒక హైబ్రీడ్ జాతీయీకరణ అని అక్కడి రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


‘ఒక రిఫైనరీపై ఇప్పటికే మూడు సార్లు ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిగాయి. మళ్లీ దాడి జరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సంస్థలను పునరుద్ధరించేందుకు యజమానులు మళ్లీ బిలియన్ల కొద్దీ సొమ్మును ఎందుకు వెచ్చిస్తారు?’ అని అక్కడి వారు పేర్కొంటున్నారు. రష్యా సంస్థలు తమ సొమ్మును ఉక్రెయిన్ దాడుల నుంచి కాపాడుకునేందుకు వెచ్చించాలని అక్కడి ప్రభుత్వం కోరుకుంటోందని చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Updated Date - Aug 26 , 2026 | 09:19 PM