48 గంటల్లో 38 సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:31 AM
పాకిస్థాన్ నుంచి స్వతంత్రం కోరుతున్న పీవోకే ప్రజలు.. 48 గంటల్లో 38 సమస్యలను పరిష్కరించకపోతే అన్నంత పనీ చేస్తామంటూ అల్టిమేటం జారీచేశారు...
8 లేదంటే అంతిమ పోరాటానికి సిద్ధం
8 పాకిస్తాన్‌కు పీవోకే హెచ్చరిక
ముజఫరాబాద్/ఇస్లామాబాద్, జూలై 9: పాకిస్థాన్ నుంచి స్వతంత్రం కోరుతున్న పీవోకే ప్రజలు.. 48 గంటల్లో 38 సమస్యలను పరిష్కరించకపోతే అన్నంత పనీ చేస్తామంటూ అల్టిమేటం జారీచేశారు. కశ్మీరీ శరణార్థులకు 12 సీట్లను పీవోకే అసెంబ్లీలో రిజర్వు చేయడాన్ని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ రాజకీయ వ్యవహారాల్లోకి పాక్ చొరబాటును సహించబోమని హెచ్చరిస్తున్నారు. పాక్ ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లలో ఇదే ప్రధానమైనది. ఈ మేరకు ‘జేఏఏసీ’ (జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ) పేరిట ఒక ప్రకటన విడుదలైంది. ప్రభుత్వానికి పెట్టిన రెండురోజుల గడువు ముగిసిన వెంటనే అంతిమ పోరాటానికి సిద్ధమవుతాయని జేఏఏసీ హెచ్చరించింది. మరోవైపు.. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ మిలిటెంట్ల హింసాత్మక దాడులతో అట్టుడికిపోతోంది. రెండు వేర్వేరు ఘటనల్లో 29మంది భద్రతా సిబ్బందిని మిలిటెండ్లు హతమార్చారు. అపహరించుకుపోయిన 18మంది పోలీసు అధికారులను తిరుగుబాటుదారులు చంపివేశారు. మరో ఘటనలో 11 మంది జవాన్లను హత్యచేశారు.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..