Share News

జీ7 సదస్సు.. ముగ్గురు భారతీయ నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ..

ABN , Publish Date - Jun 17 , 2026 | 07:07 AM

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయ నావికుల మృతి గురించి ప్రస్తావించారు.

జీ7 సదస్సు.. ముగ్గురు భారతీయ నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ..
PM Modi

ఇంటర్‌నెట్ డెస్క్: ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న నౌకపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా దాడుల కారణంగా ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ నీటిలో మునిగి చనిపోయారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయ నావికుల మృతి గురించి ప్రస్తావించారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై జరిగిన క్షిపణి దాడులలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పటంలో సాధించిన పురోగతిని మేము స్వాగతిస్తున్నాము. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఘర్షణ ఆ ప్రాంతంలోని మా మిత్రదేశాలలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. ఒమన్ తీర ప్రాంతంలో నౌకపై జరిగిన దాడిలో పలువురు భారతీయ పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రపంచ సముద్ర వాణిజ్యం ద్వారా దేశాలకు వారధులుగా నిలిచే నావికుల భద్రత మన బాధ్యత. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా.. ఎలాంటి భయాందోళనలు లేకుండా నావికులు విధులు నిర్వహించుకునేలా తగిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది’ అని అన్నారు.


16 నెలల తర్వాత కలిసిన మోదీ, ట్రంప్

ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ దాదాపు 16 నెలల తర్వాత జీ7 సదస్సులో ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుని, కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సదస్సులో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. బుధవారం ఈ ఇరువురు నేతలు సమావేశం కాబోతున్నారు. భారత్-అమెరికా సంబంధాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భద్రతా అంశాలు, ప్రాంతీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీలో చోరీ

వయస్సు 60...ర్యాంకు 9

Updated Date - Jun 17 , 2026 | 07:11 AM