Share News

పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం

ABN , Publish Date - May 16 , 2026 | 03:56 AM

పశ్చిమాసియాలో శాంతికి తమ శాయశక్తులా సహకరిస్తామిన ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన యూఏఈ రాజధాని అబూధాబీ చేరుకున్నారు.

పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం

  • యూఏఈ అధ్యక్షుడితో మోదీ భేటీ

  • చమురు నిల్వలు, ఎల్‌పీజీ సరఫరా సహా7 కీలక వ్యూహాత్మక ఒప్పందాలు

అబూధాబీ, మే 15: పశ్చిమాసియాలో శాంతికి తమ శాయశక్తులా సహకరిస్తామిన ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన యూఏఈ రాజధాని అబూధాబీ చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు షేక్‌ మొహమద్‌ బియన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో ఏడు కీలక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేశా రు. అల్‌ నహ్యాన్‌తో చర్చల ప్రారంభంలోనే.. యూఏఈపై (ఇరాన్‌) దాడులను మోదీ ఖండించారు. ఈ దేశంలో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావ రం ఉండడంతో ఇరాన్‌ తరచూ దాడులు చేస్తోంద ని, ఇది ఆమోదయోగ్యం కాదని మోదీ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా భారత్‌లో 5 బిలియన్‌ డాలర్ల (రూ.47,931 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అల్‌ నహ్యాన్‌ ప్రకటించారు. దీనివల్ల ద్వైపాక్షిక ఆర్థిక బంధం మరింత బలోపేతమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. రెండున్నర గంటల చర్చల అనంతరం మోదీ అక్కడి నుంచి నెదర్లాండ్స్‌ బయల్దేరారు.

Updated Date - May 16 , 2026 | 03:56 AM