Share News

నేటి నుంచి ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:53 AM

ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్‌ మధ్య క్షీణిస్తున్న సంబంధాల...

నేటి నుంచి ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్‌ మధ్య క్షీణిస్తున్న సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటనలో ఇందులో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌లతో మోదీ కీలక చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్‌లో మోదీ ప్రసంగానికి సుప్రీంకోర్టు అధ్యక్షుడు యెట్‌ఝాక్‌ అమిత్‌ను ఆహ్వానించకపోతే ఆయన ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ఆ దేశ ప్రతిపక్ష నేత యాయర్‌ లాపిడ్‌ హెచ్చరించారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ అమీర్‌ ఓహానా.. ఆహ్వానం పంపే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. విపక్షాలు రాకపోతే ఆ సీట్లను మాజీ సభ్యులతో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Feb 25 , 2026 | 05:53 AM