దౌత్యంతోనే ఘర్షణలకు పరిష్కారం
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:00 AM
ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికే తీవ్రమైన సవాలుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న...
ఉగ్రవాదంతో మొత్తం మానవాళికే తీవ్రమైన సవాళ్లు.. ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశాం
8 ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీ్‌సతో మోదీ ద్వైపాక్షిక చర్చలు
8 అణు ఇంధనం, సముద్ర భద్రత, కీలక ఖనిజాలతో పాటు
8 18 కీలక ఒప్పందాలపై సంతకాలు
8 ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంత బలంగా ఎప్పుడూ లేవు: అల్బనీస్
మెల్‌బోర్న్, జూలై 9: ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికే తీవ్రమైన సవాలుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, సంఘర్షణలను చర్చలు, దౌ త్యం ద్వారా మాత్రమే పరిష్కరించగలమని స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ‘ఇండో-పసిఫిక్ అనేది కేవలం రెండు మహా సముద్రాల సంగ మ స్థానం మాత్రమే కాదు. ఇది భారత్, ఆస్ట్రేలియా వంటి భావసారూప్య ప్రజాస్వామ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛా నౌకాయాన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం ఆయన ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీ్‌సతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం భారత్‌లోని అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరాను సులభతరం చేసే పౌర అణు ఇంధన ఒప్పందంతో పాటు సముద్ర భద్రత, కీలక ఖనిజాల రంగాలకు సంబంధించిన 18 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ), ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానాన్ని ఖరారు చేసే దిశగా వేగంగా పనిచేయాలని నిర్ణయించాయి. బొగ్గు, డీజి ల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువుల సరఫరాను కొనసాగించడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి అంగీకారం కుదిరింది. ‘‘ఈ రోజు అణుశక్తి రంగంలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు చేశాం. ఇది అస్ట్రేలియా నుంచి భారత్‌కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేయడంతో పాటు మన స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు కొత్త ఊపునిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. కాగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న సంబంధాలు ప్రస్తుతం ఉన్నంత కీలకంగా, బలంగా గతంలో ఎప్పుడూ లేవని ఆల్బనీస్ అన్నారు. అణుశక్తి ఒప్పందం భారత్‌కు యురేనియం ఎగుమతులను సులభతరం చేస్తుందని తెలిపారు. భారత్‌ను ఒక అగ్రశ్రేణి భాగస్వామిగా పరిగణిస్తుందని తెలిపారు. కాగా, మూడు కామన్వెల్త్ దేశాల మధ్య విశ్వసనీయమైన సాంకేతిక కూటమిని బలోపేతం చేయడంలో భాగంగా అస్ట్రేలియా-కెనడా-భారత్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (ఏసీఐటీఐ) కింద ప్రత్యేక త్రైపాక్షిక అవగాహ ఒప్పందం కూడా కుదిరింది.
ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన
భారత్ సైనిక శక్తికి ఆపరేషన్ సిందూర్ ఒక నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఆయ న మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఉగ్రవాద శిబిరాలను సమూలంగా ధ్వసం చేశామని, ఆ ప్రతిధ్వనులు ప్రపంచం మొత్తం వినిపించాయన్నారు. మరోవైపు.. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు విడనాడి, ఈ ముప్పును సమష్టిగా ఎదుర్కోవాలని ప్రపంచ దేశాలకు భారత్, ఆస్ట్రేలియా పిలుపునిచ్చాయి. ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. ఇరు దేశాల ప్రధానమంత్రుల ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో సుస్థిర శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారని వివరించారు.
భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: ఆస్ట్రేలియా సంస్థలకు మోదీ ఆహ్వానం
విమానయానం, ఆర్థిక సేవలు, కీలక ఖనిజా లు, సాంకేతికత, ఆహార శుద్ధి తదితర రంగాల్లో వృద్ధికి భారత్ సాటిలేని అవకాశాలను కల్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలను ఆహ్వానించారు. ఆల్బనీ్‌సతో చర్చలకు ముందు ఇండి యా-ఆస్ట్రేలియా సీఈవోల ఫోరమ్, ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ ఈవెంట్‌లో మోదీ ప్రసంగించారు. భారత్‌లో 500 ఆస్ట్రేలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ‘ఆస్ట్రేలియన్ సూపర్’ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ ప్రోడర్ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. భారతదేశ వృద్ధి, సంస్కరణలపై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి ఇది మరో నిదర్శనమని పేర్కొన్నారు. వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు సీఈసీఏను త్వరగా ఖ రారు చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పెట్టుబడిదారులకు సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..