Share News

ఇంధనం ఆదా కోసం పాక్‌ ‘స్మార్ట్‌’ లాక్‌డౌన్‌

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:27 AM

ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం దాయాది దేశం పాకిస్థాన్‌ మంగళవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా...

ఇంధనం ఆదా కోసం పాక్‌ ‘స్మార్ట్‌’ లాక్‌డౌన్‌

ఇస్లామాబాద్‌, ఏప్రిల్‌ 7: ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం దాయాది దేశం పాకిస్థాన్‌ మంగళవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ‘స్మార్ట్‌ లాక్‌డౌన్‌’ ప్రకటించింది. వ్యాపార సమయం, పబ్లిక్‌ కార్యక్రమాలపై ఆంక్షలు విధించింది. దేశంలోని ప్రధాన కేంద్రాల్లోని మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య కేంద్రాలు ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు, హోటళ్లు రాత్రి 10 గంటలకు మూసేయాల్సి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా రాత్రి 10 గంటల్లోపే ముగించుకోవాలి. మెడికల్‌ షాపులు, ఫార్మసీ ఔట్‌లెట్లతోపాటు అత్యవసర సర్వీసులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. భారీ స్థాయిలో ప్రజలు గుమిగూడటంపైనా ఆంక్షలు విధించింది.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 06:28 AM