పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 15 మంది పోలీసుల మృతి
ABN , Publish Date - May 10 , 2026 | 04:23 PM
పాకిస్థాన్‌లోని బన్నులో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి ఓ సూసైడ్ బాంబర్ పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో ఫతే ఖేల్ పోలీస్ చెక్‌పాయింట్‌ను ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది.
ఇస్లామాబాద్, మే 10: పాకిస్థాన్‌లోని బన్నులో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి ఓ సూసైడ్ బాంబర్ పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో ఫతే ఖేల్ పోలీస్ చెక్‌పాయింట్‌ను ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకుంది. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీసి, ఆస్పత్రికి తరలించింది. రాత్రి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
ఈ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను రెహ్మత్ అయాజ్, సనాఉల్లా, నియాజ్ అలీ, హబీబ్, సాదుల్లా జన్, కమ్రన్, సికిందర్, కమ్రన్, నూరుల్లా, అబీబ్ జానీ, ఇమ్రాన్, కలీముల్లా, సాధిక్ఉల్లా, మునిర్ ఆలమ్ ఖాన్, రెహ్మతుల్లా ఖాన్, ఫారుఖ్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పేలుడు ధాటికి చెక్ పాయింట్‌కు దగ్గరలోని ఇళ్లు, ఇతర కట్టడాలు దెబ్బతిన్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దాని ప్రకారం.. పేలుడు కారణంగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ పెద్ద వికెట్‌గా మారాడు: మహ్మద్ కైఫ్
హైదరాబాద్‌లో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం