Share News

ఎన్విడియా వివాదం.. ఎలాన్ మస్క్ పాత వ్యాఖ్య మళ్లీ వైరల్..

ABN , Publish Date - Nov 09 , 2026 | 10:45 AM

ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో ఆసక్తికరమైన వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ చైనా గూఢచర్య ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బిలియనీర్ ఎలాన్ మస్క్ గతంలో చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.

ఎన్విడియా వివాదం.. ఎలాన్ మస్క్ పాత వ్యాఖ్య మళ్లీ వైరల్..
Elon Musk

వాషింగ్టన్, నవంబర్ 9: ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో ఆసక్తికరమైన వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ చైనా గూఢచర్య ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బిలియనీర్ ఎలాన్ మస్క్ గతంలో చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.


2025 అక్టోబర్‌లో మస్క్ చేసిన ఓ వ్యాఖ్య ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 'ఆమెకు అందంలో పదికి పది మార్కులు వేస్తే.. నువ్వు ఆమెకు ఓ ఆస్తిగా మారుతావు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ అందంగా కనిపిస్తే ఆమె పట్ల ఆకర్షితులయ్యే ముందు జాగ్రత్తగా ఉండాలన్నది ఈ వ్యాఖ్యలోని అంతరార్థం. ముఖ్యంగా కీలక సాంకేతిక రహస్యాలు తెలిసిన వ్యక్తులు విదేశీ గూఢచర్య సంస్థలకు లక్ష్యంగా మారే ప్రమాదం ఉందని మస్క్ హెచ్చరించినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ '10' అంటే అందంలో పదికి పది మార్కులని. అలాగే, ఆస్తి (Asset) అంటే గూఢచర్య సంస్థలు ఉపయోగించుకోదగిన వ్యక్తి లేదా లక్ష్యమని అర్థం. అంటే, ఓ ఆకర్షణీయమైన మహిళ ఎవరిపైనైనా ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటే.. దాని వెనుక ఏదైనా ప్రయోజనం ఉందేమోనని జాగ్రత్తగా పరిశీలించాలన్నది మస్క్ వ్యాఖ్యలోని వ్యంగ్య హెచ్చరిక. ప్రస్తుతం ఎన్విడియా సీఈఓ చుట్టూ నెలకొన్న వివాదంతో మస్క్ పాత వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.


కాగా, 2025లో బ్రిటన్‌కు చెందిన ఓ పత్రిక ఆకస్తికర కథనాన్ని ప్రచురించింది. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న టెక్నాలజీ నిపుణులను చైనా, రష్యా గూఢచారులు ఆకర్షణీయమైన మహిళల ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రేమ, పరిచయం, స్నేహం, వివాహం వంటి వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించుకుని కీలక సాంకేతిక సమాచారం, వ్యాపార రహస్యాలను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగా, ఈ కథనం అప్పట్లో టెక్నాలజీ రంగాన్ని కుదిపేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

గోవా మంద్రెమ్ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. వీడియో వైరల్

దీపావళి తర్వాత ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 366కు చేరిన సగటు ఏక్యూఐ..!

Updated Date - Nov 09 , 2026 | 10:45 AM