Share News

రష్యా, ఉక్రెయిన్‌లలో అణ్వాయుధ దాడి అలర్ట్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:02 AM

నాలుగున్నరేళ్లుగా యుద్ధంలో మునిగి ఉన్న రష్యా, ఉక్రెయిన్‌లలో ప్రజలకు ఆదివారం అణ్వాయుధ దాడి అలర్ట్‌లు రావటం కలకలం రేపింది.

రష్యా, ఉక్రెయిన్‌లలో అణ్వాయుధ దాడి అలర్ట్‌
ukrine

  • అత్యవసర సందేశ యాప్‌లను హ్యాక్‌చేసి సందేశాలు పంపిన దుండగులు

  • తప్పుడు సందేశాలుగా గుర్తించి ఊపిరి పీల్చుకున్న అధికారులు

మాస్కో, నవంబరు 2: నాలుగున్నరేళ్లుగా యుద్ధంలో మునిగి ఉన్న రష్యా, ఉక్రెయిన్‌లలో ప్రజలకు ఆదివారం అణ్వాయుధ దాడి అలర్ట్‌లు రావటం కలకలం రేపింది. ఈ దేశాల్లోని ఎమర్జెన్నీ అలర్ట్‌ మొబైల్‌ యాప్‌లను హ్యాక్‌ చేసిన కొందరు సైబర్‌ నేరగాళ్లు.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తోపాటు రష్కాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా రేడియేషన్‌ వ్యాపిస్తోందని ప్రజలకు సందేశాలు పంపారు. దీంతో తమపై అణ్వాయుధ దాడి జరిగిందని రెండు దేశాల ప్రజలు భయపడ్డారు. అయితే, అధికారులు వెంటనే స్పందించి అవి తప్పుడు సందేశాలని తేల్చారు. తమ ఎమర్జెన్సీ మొబైల్‌ యాప్‌లు హ్యాకింగ్‌ బారిన పడ్డాయని ఇరు దేశాల అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌ మొబైల్‌ యాప్‌ను హ్యాక్‌ చేసింది తామేనని హ్యాకింగ్‌ గ్రూప్‌ హిట్‌కోర్‌ ప్రకటించింది.

Updated Date - Nov 03 , 2026 | 07:03 AM