3డీ ప్రింటింగ్‌ తుపాకులపై న్యూయార్క్‌లో నిషేధం

ABN, Publish Date - Jun 14 , 2026 | 03:43 AM

అమెరికాలో 3డీ ప్రింటర్లు ఉపయోగించి సీరియల్‌ నెంబర్లు లేకుండా రూపొందిస్తున్న ‘ఘోస్ట్‌ గన్స్‌’ తయారీకి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

న్యూయార్క్‌, జూన్‌ 13: అమెరికాలో 3డీ ప్రింటర్లు ఉపయోగించి సీరియల్‌ నెంబర్లు లేకుండా రూపొందిస్తున్న ‘ఘోస్ట్‌ గన్స్‌’ తయారీకి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా న్యూయార్క్‌ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 3డీ ప్రింటర్లు తుపాకుల విడిభాగాలను తయారు చేయకుండా నిలుపుదల చేసే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో అన్ని 3డీ ప్రింటర్లలో ఆ సాంకేతికత తప్పనిసరిగా ఉండాలంటూ ఓ చట్టం తీసుకొచ్చింది. దీంతో 3డీ ప్రింటర్ల అంశంలో ఈ తరహా చట్టం చేసిన తొలి ప్రాంతంగా న్యూయార్క్‌ నిలిచింది. ఈ కొత్త చట్టాన్ని క్యాలిఫోర్నియా రాష్ట్రం కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.

Updated at - Jun 14 , 2026 | 03:43 AM