Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

ABN , Publish Date - Apr 30 , 2026 | 10:09 PM

నేపాల్‌లోని రోల్పా జిల్లాలో జీపు అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

ఖాట్మండ్, ఏప్రిల్ 30: నేపాల్‌లోని రోల్పా జిల్లాలో జీపు అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తవాంగ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. జల్‌జలాలోని వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు.


మరో వైపు నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రహదారిపై భారీగా బురద వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో వేగంగా వెళ్తున్న జీపు.. భారీ లోయలో పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని అధికారులు వివరించారు.

Updated Date - Apr 30 , 2026 | 10:14 PM