Share News

అమెరికాలో ముగిసిన మాటా మహాసభలు

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:35 AM

ఉత్తర అమెరికా తెలుగు సమాజ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాటా 2వ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి...

అమెరికాలో ముగిసిన మాటా మహాసభలు

ఉత్తర అమెరికాలో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు సంబురం

రవీంద్రభారతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉత్తర అమెరికా తెలుగు సమాజ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాటా 2వ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండు రోజుల పాటు సాగిన ఈ మహాసభలు తెలుగు ఐక్యతకు సజీవ ప్రతీకగా నిలిచాయి. సంస్కృతి, ఆధ్యాత్మికత, వినోదంతో పాటు సామాజిక చైతన్యం, సాంకేతికతను సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 7,500లకు పైగా తెలుగు కుటుంబాలలు ఒకే వేదికపైకి రావడం విశేషం. మత సామరస్యానికి అద్ధం పడుతూ ఒక ఇమామ్‌, క్రైస్తవ పాస్టర్‌, హిందూ పూజారి సంయుక్తంగా నిర్వహించిన ప్రార్థనలతో మహాసభలు ప్రారంభమయ్యాయి. తెలుగు సినీ, సాంస్కృతిక రంగ ప్రముఖల రాకతో మహాసభల ప్రాంగణం కళకళలాడింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ లైవ్‌ కాన్సర్ట్‌తో వేలాది మంది ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. యువ గాయకుడు రామ్‌ మిర్యాల సంగీత విభావరితో ఆకట్టుకున్నారు. నటీనటులు నిఖిల్‌, సిద్దార్థ్‌, ఐశ్వర్య రాజేష్‌, సుమన్‌, అలీ, విషి అయ్యార్‌, శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్‌, మిమిక్రీ రమేష్‌ తమ ప్రదర్శనలతో అలరించారు. ఈ మహాసభలలో ప్రమఖ నటి జయప్రదకు మాటా లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేశారు. దీంతో పాటు మాటా ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రదానం చేశారు. శ్రీనివాసరావు, భాస్కర్‌ గంటి, సాయినాథ్‌ కర్నాటి, స్వాతి అట్లూరి, దాము గేదల, విజయభాస్కర్‌, నాగేశ్వరరావు పూజారి, రాజు చామర్తి, కృష్ణ మద్దిపట్ల అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో మాటా అధ్యక్షుడు రమణ కిరణ్‌ దుద్దాగి, కన్వీనర్‌ శ్రీధర్‌ గూడల, సభ్యులు విజయభాస్కర్‌ కలాల్‌, ప్రవీణ్‌, కళ్యాణి, శ్రీనివాస్‌ గణగోని, ప్రవీప్‌ సామల, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 05:35 AM