ప్రభుత్వం, ప్రవాసుల మధ్య వారధిగా జయరాం
ABN , Publish Date - Apr 28 , 2026 | 07:36 AM
అమెరికాలో నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ తెలుగుజాతి ఔన్నత్యాన్ని కోమటి జయరాం నిలబెట్టారని ప్రముఖ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కొనియాడారు
డా.నోరి దత్తాత్రేయుడు ప్రశంసలు
(డల్లాస్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
అమెరికాలో నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ తెలుగుజాతి ఔన్నత్యాన్ని కోమటి జయరాం నిలబెట్టారని ప్రముఖ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కొనియాడారు. ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను సత్కరించేందుకు ఆదివారం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రవాసులకు మధ్య వారధిలా కోమటి జయరాం ఉన్నారని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని కోమటి జయరాం పేర్కొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణల సందేశాన్ని ఏవీ ద్వారా ప్రదర్శించారు. అనంతరం కోమటి జయరాంను, నోరి దత్తాత్రేయుడిని సత్కరించారు. కార్యక్రమంలో మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, రవి పొట్లూరి, శ్రీధర్ అప్పసాని, రాధాకృష్ణ మూల్పురి, రంజిత్ కోమటి, మురళి పమిడిముక్కల, ఫణి కంతేటి, శ్రీధర్ సాదినేని, నందగిరీశ్ మూల్పూరి, నాగరాజు చింతం, సురేశ్ యలమంచిలి, గోపి వాగ్వాల, హరి దుంగతావుల, విశ్వనాథ్ కోగంటి, లావా ఐనంపూడి, గౌరి కొర్రోతు, భాను మాగలూరి, సాయి బొల్లినేని, మధు ముప్పాల, వి.శ్రీధర్, శ్రీహరి మందడి తదితరులు పాల్గొన్నారు.