యూఏఈకి ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:38 AM
శత్రువుల నుంచి ఎడతెరిపి లేకుండా దూసుకొచ్చే క్షిపణులు, రాకెట్లను ఆకాశంలోనే అడ్డుకొని ధ్వంసం చేయటం...
జెరూసలేం, ఏప్రిల్ 27: శత్రువుల నుంచి ఎడతెరిపి లేకుండా దూసుకొచ్చే క్షిపణులు, రాకెట్లను ఆకాశంలోనే అడ్డుకొని ధ్వంసం చేయటం కోసం ఇజ్రాయెల్ రూపొందించుకున్న ఐరన్‌డోమ్ గగన రక్షణ వ్యవస్థను ఇరాన్ దాడుల సమయంలో యూఏఈకి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికాలు ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టాయి. అందుకు ప్రతీకారంగా గల్ఫ్‌దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. వీటిని అడ్డుకొనేందుకు యూఏఈకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను ఇవ్వటంతోపాటు దానిని ఉపయోగించేందుకు సిబ్బందిని కూడా పంపినట్లు ఆక్సియోస్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం