Share News

హెజ్‌బొల్లా నేత హతం.. ఇజ్రాయెల్ ప్రకటన

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:36 PM

హెజ్‌బోల్లా చీఫ్ నజీమ్ ఖాసిమ్‌ బంధువు, వ్యక్తిగత సలహాదారు అయిన యూసుఫ్ అలీని మట్టుపెట్టినట్టు ఐడీఎఫ్ తాజాగా ప్రకటించింది.

హెజ్‌బొల్లా నేత హతం.. ఇజ్రాయెల్ ప్రకటన
Hezbollah Leader Yousuf Ali Killed

ఇంటర్నెట్ డెస్క్: లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లాకు చెందిన మరో కీలక నేతను మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) గురువారం ఎక్స్ వేదికగా తెలిపింది. హెజ్‌బోల్లా చీఫ్‌ నజీమ్ ఖాసిమ్‌కు బంధువు, వ్యక్తిగత సలహాదారుడైన అలీ యూసుఫ్ హార్షీ తమ దాడుల్లో కన్నుమూసినట్టు తెలిపింది. బుధవారం బీరుట్‌ నగరంలో జరిపిన దాడుల్లో యూసుఫ్ అలీ మరణించినట్టు పేర్కొంది.

ఆయుధాలు, దళాలను తరలించేందుకు హెజ్‌బొల్లా ఉపయోగించే రెండు మార్గాలపై దాడులు చేశామని ఐడీఎఫ్ తెలిపింది. వీటితో పాటు దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లాకు చెందిన 10 ఆయుధాల నిల్వ కేంద్రాలు, సంస్థ కార్యాలయాలపై దాడులు చేశామని వెల్లడించింది. హెజ్‌బొల్లా చీఫ్ వ్యవహారాల్లో యూసుఫ్ ఖార్షీ కీలకంగా వ్యవహరించేరని పేర్కొంది.


లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో అమెరికా-ఇరాన్‌ల కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రతికూల ప్రభావం ఆందోళనలు పెరుగుతున్నాయి. బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 182 మంది మరణించగా 800 మందికి పైగా గాయపడ్డారు. బీరుట్‌లోని హెజ్‌బొల్లా నేతలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ కేవలం 10 నిమిషాల్లోనే 100 మిసైల్స్‌ను ప్రయోగించింది. బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్, బేకా వ్యాలీలో ఒకేసారి ఈ దాడులు చేసింది. పౌర నివాసాలు, సామాన్యులను అడ్డుపెట్టుకుని హెజ్‌బొల్లా తమపై దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలూ చదవండి:

ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్.. పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తేవడంతో..

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు మళ్లుతున్న నౌకలు

Updated Date - Apr 09 , 2026 | 04:35 PM