Share News

అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌ పార్లమెంటు ఎన్నికలు.. నెతన్యాహుకు సవాలు!

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:00 PM

త్వరలో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 120 సీట్లు ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంటు క్నెసెట్‌కు అక్టోబర్ 27న ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌ పార్లమెంటు  ఎన్నికలు.. నెతన్యాహుకు సవాలు!
Israel elections

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 120 సీట్లు ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంటు క్నెసెట్‌కు అక్టోబర్ 27న ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత క్నెసెట్ నాలుగేళ్ల పదవీకాలం జులై 17న పూర్తవుతుంది. దీంతో, గత 50 ఏళ్లల్లో పూర్తికాలం పాటు పదవిలో ఉన్న తొలి ప్రధానిగా నెతన్యాహు అరుదైన గుర్తింపు సొంతం చేసుకోనున్నారు. 1988 తరువాత ఇజ్రాయెల్‌లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడం కూడా ఇదే తొలిసారి. ఇక ఎన్నికల తేదీపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

నెతన్యాహుకు సవాలు..

నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీకి ఈ ఎన్నికలు సవాలుగా మారే అవకాశం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో బయటపడ్డ భద్రతా పరమైన లోపాలు, గాజా, లెబనాన్ విషయంలో ఎదురవుతున్న వైఫల్యాలు, ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా మధ్య అభిప్రాయభేదాలు వంటివన్నీ ఈ లికుడ్ పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.


ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 61 సీట్లు సాధించాలి. అయితే, ఈసారి ఎన్నికల్లో నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీకి, గాడీ ఐసిన్‌కోట్ సారథ్యంలోని ప్రతిపక్ష యషర్ పార్టీకి సమానంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల తరువాత అతిపెద్ద పార్టీగా యషర్ అవతరించవచ్చని కూడా అక్కడి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కో పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయనే అంశం ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. కనీసం 3.25 శాతం ఓట్లు సాధించిన పార్టీ పార్లమెంటులో కాలు పెట్టేందుకు అర్హత సాధిస్తుంది.


ఈ వార్తలనూ చదవండి:

నేపాల్‌లో మళ్లీ జెన్-జీ నిరసనలు

సముద్ర రవాణాను నిలిపివేసిన ఖతార్.. ఇరాన్‌పై ఒమన్‌ ఫైర్!

Updated Date - Jul 12 , 2026 | 11:10 PM