Share News

10 లక్షల మంది యోధులతో సిద్ధంగా ఉన్నాం ఇరాన్‌

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:37 AM

ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు దిగవచ్చని, కీలక దీవిని స్వాధీనం చేసుకోవచ్చని వస్తున్న వార్తలపై ఇరాన్‌ మిలిటరీ దీటుగా స్పందించింది...

10 లక్షల మంది యోధులతో సిద్ధంగా ఉన్నాం ఇరాన్‌

దుబాయ్‌, మార్చి 26: ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు దిగవచ్చని, కీలక దీవిని స్వాధీనం చేసుకోవచ్చని వస్తున్న వార్తలపై ఇరాన్‌ మిలిటరీ దీటుగా స్పందించింది. ఇరాన్‌లో 10లక్షల మంది యోధులు సిద్ధంగా ఉన్నారని.. అమెరికా దళాలకు దారుణమైన నరకం చూపిస్తామని హెచ్చరించింది. ఇరాన్‌ మిలిటరీ అధికారులను ఉటంకిస్తూ టాస్నిమ్‌ వార్తా సంస్థ ఈ మేరకు కథనం ప్రచురించింది. ‘‘రెవెల్యూషనరీ గార్డ్స్‌, బసిజ్‌ ఫోర్స్‌లలో చేరడానికి ఇరాన్‌ యువత పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు అమెరికా పనికిరాని వ్యూహాలు పన్నుతోంది. వారిని ఎదుర్కోవడానికి మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’’ అని మిలటరీ వర్గాలు పేర్కొన్నట్టు వెల్లడించింది.

ఇరాన్‌కు రష్యా నుంచి డ్రోన్లు!

యుద్ధంలో ఇరాన్‌కు సాయంగా రష్యా డ్రోన్లను సరఫరా చేస్తోందంటూ యూరప్‌ దేశాల నిఘా సంస్థలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ఇరాన్‌కు సాయంగా డ్రోన్లను, ఆహారం, మందులను అందజేస్తోందని, కాస్పియన్‌ సముద్రమార్గంలో నౌకల్లో వాటిని తరలిస్తోందని వెల్లడించింది. అయితే ఇవన్నీ తప్పుడు వార్తలని రష్యా అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 06:58 AM