మళ్లీ దాడి చేస్తే అణు యుద్ధమే!?
ABN , Publish Date - May 13 , 2026 | 05:22 AM
అమెరికా లేదా ఇజ్రాయెల్ దళాలు తమపై మరోసారి దాడిచేస్తే.. తమ యురేనియం నిల్వలను అణ్వాయుధాల తయారీకి అవసరమైన 90% స్థాయికి శుద్ధిచేసే...
అమెరికాను హెచ్చరించిన ఇరాన్
టెహ్రాన్, మే 12: అమెరికా లేదా ఇజ్రాయెల్ దళాలు తమపై మరోసారి దాడిచేస్తే.. తమ యురేనియం నిల్వలను అణ్వాయుధాల తయారీకి అవసరమైన 90% స్థాయికి శుద్ధిచేసే ప్రక్రియ చేపడతామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై సరికొత్త సైనిక చర్య చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక చేసింది. ఇరాన్ పార్లమెంటరీ కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయి.. ఎక్స్ వేదికగా ఈ హెచ్చరిక చేశారు. ఇరాన్‌ను అణ్వాయుధాలు తయారు చేయడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ట్రంప్ ఇప్పటికే పలుమారు చెప్పారు. ఇదిలా ఉండగా. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం... ఇరాన్ గత ఎనిమిదేళ్లలో దాదాపు 11,000 కిలోల అధిక స్థాయి యురేనియంను సమకూర్చుకుంది. 2006లోనే యురేనియంను సమకూర్చుకునే ప్రక్రియను ప్రారంభించిన ఇరాన్.. సంవత్సరాలు గడిచేకొద్దీ నిల్వ పెంచుకుంటూ పోతున్నట్టు తెలిపింది. అయితే ఇరాన్ దీన్ని ఎక్కడ దాచిందనేది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఇరాన్ సమకూర్చుకున్న యురేనియంలో అధిక భాగం ఇప్పటికీ ఇస్ఫహాన్ అణు కేంద్రంలోనే ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన అణు పర్యవేక్షణ సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఏఈఏ) భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News