Share News

అమెరికా పశ్చాత్తాపపడేదాకా యుద్ధం

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:59 AM

అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని, అసలు చర్చలు జరపాలని తాము కోరుకోవడం లేదని ఇరాన్‌ అత్యున్నత భద్రతా సమన్వయ విభాగం...

అమెరికా పశ్చాత్తాపపడేదాకా యుద్ధం

  • ఓటమిని ఒప్పందంగా చెప్పుకోవద్దు ఇరాన్‌

దుబాయ్‌, మార్చి 25: అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని, అసలు చర్చలు జరపాలని తాము కోరుకోవడం లేదని ఇరాన్‌ అత్యున్నత భద్రతా సమన్వయ విభాగం ‘ఖాతమ్‌ అల్‌ అన్బియా ప్రధాన కార్యాలయం’ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి బుధవారం ప్రకటించారు. ‘‘ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా చెప్పుకొంటున్న దేశం.. తానేమైనా చేయగలిగితే ఇప్పటికే ఈ పరిస్థితి నుంచి బయటపడి ఉండేది. మీ పరాజయాన్ని ఒప్పందంగా చెప్పుకోకండి. మీ శుష్క హామీ ల శకం ముగిసింది. మీకు మీరే చర్చించుకునే స్థాయికి వచ్చారా?’’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమాసియాలో అమెరికా వ్యూహాత్మక, ఆర్థిక ప్రాభవం ఇక ముగిసిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. విజయం సాధించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ ప్రతినిధి అలీ అబ్దొల్లాషి అలియాబాదీ ప్రకటించారు. ఇరాన్‌పై దాడి విషయంలో అమెరికా ప్రశ్చాత్తాపపడే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 06:03 AM