ట్రంప్ యుద్ధాన్ని అమెరికా ఓటర్లు తిరస్కరించారు
ABN , Publish Date - Nov 05 , 2026 | 07:15 AM
ఇరాన్‌పై ట్రంప్ యుద్ధాన్ని అమెరికా ప్రజలు గట్టిగా తిరస్కరించారని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వ్యాఖ్యానించారు
అయినా ఇరాన్‌పై అమెరికా శత్రుత్వం తగ్గుతుందని భావించలేం!
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ
రియాద్, నవంబర్ 4: ఇరాన్‌పై ట్రంప్ యుద్ధాన్ని అమెరికా ప్రజలు గట్టిగా తిరస్కరించారని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వ్యాఖ్యానించారు. అయితే, తాజా ఫలితాలతో ఇరాన్‌పై అమెరికా వైఖరి మారుతుందని భావించడం పొరపాటేనని పేర్కొన్నారు. అమెరికాకు తాము ఎన్ని రాయితీలు ఇచ్చినా ఇరాన్‌పై శత్రుత్వం తగ్గదన్నారు. యుద్ధానికి అమెరికా ప్రజలు నో చెప్పారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబఫ్ సైతం వ్యాఖ్యానించారు. ప్రజల అభీష్టాన్ని అమెరికా ప్రభుత్వం విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. తాజా ఫలితాలు ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని ఎటువైపు మలుపు తిప్పుతాయో చూడాలని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మరోవైపు 1979లో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆక్రమించిన ఘటన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టెహ్రాన్‌లో బుధవారం వేలాది మంది ర్యాలీ నిర్వహించారు.