ఇంటర్నెట్ షట్‌డౌన్‌లో ఇరాన్ రికార్డు
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:10 AM
అమెరికా, ఇజ్రాయెల్ తొలి దాడి చేసిన ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ ప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్‌ను పూర్తిగా దిగ్బంధించింది.
టెహ్రాన్, ఏప్రిల్ 25: అమెరికా, ఇజ్రాయెల్ తొలి దాడి చేసిన ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ ప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్‌ను పూర్తిగా దిగ్బంధించింది. ఇంటర్నెట్ బ్లాకౌట్ అయ్యి శనివారం నాటికి 57 రోజులు గడిచిపోయింది. యావత్ దేశాల స్థాయిలో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ నెట్‌వర్క్ షట్‌డౌన్‌గా ఇది రికార్డు అని ఇంటర్నెట్ కార్యకలాపాలు పర్యవేక్షించే నెట్‌బ్లాక్స్ సంస్థ పేర్కొంది. ప్రపంచంలో ఎప్పుడూ ఇంత ఎక్కువ కాలం నెట్‌వర్క్‌ను ఏదేశం నిలిపివేయలేదని వెల్లడించింది. ఇప్పటి వరకు 1,344 గంటల పాటు ఇరానియన్ల గొంతు ప్రపంచానికి వినిపించకుండా పోయిందని, అంతేకాకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని తెలిపింది.