Share News

ఇరాన్‌పై వరుస దాడులు..

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:43 AM

అమెరికా గురువారం తెల్లవారుజామున ఇరాన్‌ దక్షిణ తీర ప్రాంతంలోని బందర్‌ అబ్బాస్‌, బుషెహర్‌, చబహార్‌, మరికొన్ని పట్టణాలు, పోర్టులపై దాడులు చేసింది. ఆ రోజుకు తమ దాడులు...

ఇరాన్‌పై వరుస దాడులు..

మేం కాదన్న అమెరికా, ఇజ్రాయెల్‌

  • ముగిసిన అలీ ఖమేనీ అంత్యక్రియలు

దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జూలై 10: అమెరికా గురువారం తెల్లవారుజామున ఇరాన్‌ దక్షిణ తీర ప్రాంతంలోని బందర్‌ అబ్బాస్‌, బుషెహర్‌, చబహార్‌, మరికొన్ని పట్టణాలు, పోర్టులపై దాడులు చేసింది. ఆ రోజుకు తమ దాడులు ముగిసినట్టు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ కూడా ప్రకటించింది. కానీ గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా ఇరాన్‌ బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రం, సిస్టాన్‌, అహ్వాజ్‌, కొనరాక్‌ పట్టణాలతోపాటు పలు ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయి. వరుసగా పేలుళ్లు వినిపించాయి. అమెరికానే ఈ దాడులు చేసిందని అంతా భావించారు. కానీ గురువారం ఉదయం తర్వాత ఇరాన్‌పై తామెలాంటి దాడులూ చేయలేదని అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌ ప్రమేయమేమీ లేదని ఆ దేశ సైనికాధికారి ఒకరు మీడియాకు చెప్పారు. దీనితో దాడులు చేసినదెవరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇరాన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అమెరికా తాజా దాడుల వెనుక యూఏఈ హస్తం ఉందని, దీనికి యూఏఈ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్‌ పార్లమెంటరీ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు ఇస్మాయిల్‌ కౌసారీ శుక్రవారం హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో.. సౌదీ, యూఏఈ కూడా ఇరాన్‌పై దాడులు చేశాయని గల్ఫ్‌ దేశాల అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇరాన్‌ దివంగత సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. ఖమేనీ పుట్టిన, ఇరాన్‌ ప్రజలు పవిత్రంగా భావించే మషాద్‌ పట్టణంలోని మసీదులో భౌతికకాయాన్ని ఖననం చేశారు.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 05:43 AM