హోర్ముజ్ దాటేందుకు ఇరాన్ ఫీజులు
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:58 AM
హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనధికారిక టోల్‌బూత్ తెరిచిందని నౌకా రవాణా సమాచార వెబ్‌సైట్ ‘లాయిడ్స్‌లిస్ట్’ పేర్కొంది....
హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనధికారిక టోల్‌బూత్ తెరిచిందని నౌకా రవాణా సమాచార వెబ్‌సైట్ ‘లాయిడ్స్‌లిస్ట్’ పేర్కొంది. నౌకలు సాధారణ మార్గంలో కాకుండా.. అన్ని పత్రాలు సమర్పించి, క్లియరెన్స్ కోడ్‌లు పొంది ఇరాన్ సూచించిన మార్గంలో ప్రయాణిస్తున్నాయని తెలిపింది. అలా మార్చి 13 నుంచి 25వ తేదీ వరకు 26 నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటాయని వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి నుంచి నౌకలను భద్రంగా వెళ్లనిచ్చినందుకు ఇరాన్ ఫీజులు వసూలు చేస్తోందని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సెక్రెటరీ జనరల్ జసేమ్ మొహమ్మద్ అల్ బుదైవి కూడా పేర్కొన్నారు. ఈ అంశంపై పశ్చిమాసియా దేశాల నుంచి అధికారిక ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..