హెచ్-1బీ వీసా కనీస వేతనం పెంపు ప్రతిపాదన.. 13 యూఎస్ రాష్ట్రాల మద్దతు
ABN , Publish Date - Jun 01 , 2026 | 09:24 PM
హెచ్-1బీ వీసా ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచాలన్న కార్మిక శాఖ ప్రతిపాదనకు 13 రాష్ట్రాలు మద్దతు తెలిపాయి.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసాతో పాటు ఇతర వీసాల్లో కనీస వేతనాన్ని పెంచాలని ఇండియానా రాష్ట్ర (యూఎస్) అటార్నీ జనరల్ టాడ్ రోకిటా డిమాండ్ చేశారు. తక్కువ జీతాలతో విదేశీ ఉద్యోగులను అమెరికన్ కంపెనీలు నియమించుకుంటున్న వైనానికి ఫుల్ స్టాప్ పడాలని అన్నారు. హెచ్-1బీతో పాటు హెచ్-1బీ1, ఈ-3, పీఈఆర్‌ఎమ్ ప్రోగ్రామ్‌ల కింద ఉన్న విదేశీ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచాలని అమెరికా కార్మిక శాఖ ఇటీవల ఒక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే 13 రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయని ఆయన తెలిపారు.
హెచ్-1బీ వీసాతో కంపెనీలు తక్కవ జీతాలకు విదేశీ వర్కర్లను నియమించుకుంటూ అమెరికన్లకు జాబ్స్‌ను దూరం చేస్తున్నాయని 13 రాష్ట్రాల కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వీసాలతో వర్కర్ల సగటు వేతనం పెరగకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తోంది. కొన్ని సంస్థలు అసలు అమెరికన్ ఉద్యోగుల గురించి ప్రయత్నించకుండానే నేరుగా హెచ్-1బీ వీసాల వారికి జాబ్స్ ఇస్తున్నాయని రాష్ట్రాల ప్రతినిధులు తెలిపారు. ఈ తీరుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుత వీసా విధానంలోని రక్షణలను సరిపోవని వాదిస్తున్నారు. ఇంతకంటే హానికారక, విపత్కర కార్యక్రమం మరొకటి లేదని రోకిటా వ్యాఖ్యానించారు. ఈ దిశగా గళమెత్తుతున్న రాష్ట్రాలను ముందుండి నడిపించే అవకాశం తనకు దక్కడం గర్వకారణమని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని తెలిపారు.
ఈ వార్తనూ చదవండి:
యూఎస్‌తో చర్చలకు ఇరాన్ బ్రేక్?
పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..