Share News

మాలిలో భారతీయుడి కిడ్నాప్.. రూ. 44 కోట్లు చెల్లించి బయటపడ్డాడు..

ABN , Publish Date - Jul 27 , 2026 | 03:05 PM

మాలిలో ఓ భారతీయ వ్యాపారి కిడ్నాప్‌కు గురయ్యారు. వ్యాపారిని విడిచిపెట్టాలంటే.. 44 కోట్ల రూపాయలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులు 44 కోట్ల రూపాయలు చెల్లించి వ్యాపారిని కిడ్నాపర్ల చెరనుంచి విడిపించుకున్నారు.

మాలిలో భారతీయుడి కిడ్నాప్.. రూ. 44 కోట్లు చెల్లించి బయటపడ్డాడు..
Indian-origin diamond trader

ఇంటర్‌నెట్ డెస్క్: మాలిలో ఓ భారతీయ వ్యాపారి కిడ్నాప్‌కు గురయ్యారు. వ్యాపారిని విడిచిపెట్టాలంటే.. 44 కోట్ల రూపాయలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులు 44 కోట్ల రూపాయలు చెల్లించి వ్యాపారిని కిడ్నాపర్ల చెరనుంచి విడిపించుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాకు చెందిన 75 ఏళ్ల ధీరూ రమణి అనే వ్యక్తి అమెరికాలో సెటిల్ అయ్యారు.


ఆయన ఫ్యామిలీ మొత్తం వజ్రాల వ్యాపారంలోనే ఉంది. కొంతకాలం క్రితం ధీరూ రమణి మాలి దేశంలో బంగారు గనిని కొన్నారు. అప్పటినుంచి మాలిలోనే ఉంటున్నారు. గత ఏప్రిల్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు అమెరికాలో ఉంటున్న ధీరూ రమణి కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. ధీరూను విడిచిపెట్టాలంటే 100 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, రెండు వర్గాల మధ్య చర్చలు జరిగాయి.


యూరో 4 మిలియన్లు( ఇండియన్ కరెన్సీలో దాదాపు 44 కోట్ల రూపాయలు) ఇవ్వడానికి ధీరూ రమణి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. తాజాగా, 44 కోట్ల రూపాయలు కిడ్నాపర్లకు చెల్లించి ధీరూ రమణిని విడిపించారు. నాలుగు నెలల నరకం తర్వాత ఆయన బయటపడ్డారు. ఈ సంఘటనపై మాలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ధీరు రమణిని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కృష్ణా జలాల్లో వాటాపై సుప్రీంకోర్టులో విచారణ.. కర్ణాటక విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం

3 గంటల్లో 1000 బంతులు.. సూర్యకుమార్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

Updated Date - Jul 27 , 2026 | 03:09 PM