Share News

ఇజ్రాయెల్‌ నుంచి 2 వేల మెషిన్‌ గన్‌లు

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:34 AM

ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ ఆయుధ తయారీ సంస్థ నుంచి తొలి విడతగా 2 వేల తేలికపాటి మిషన్‌ గన్‌ (ఎల్‌ఎంజీ)లు భారత్‌కు చేరుకున్నాయి....

ఇజ్రాయెల్‌ నుంచి 2 వేల మెషిన్‌ గన్‌లు

  • మొదటి బ్యాచ్‌ను అందుకున్న భారత్‌

జెరూసలేం, ఏప్రిల్‌ 1: ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ ఆయుధ తయారీ సంస్థ నుంచి తొలి విడతగా 2 వేల తేలికపాటి మిషన్‌ గన్‌ (ఎల్‌ఎంజీ)లు భారత్‌కు చేరుకున్నాయి. భారత సైన్యం కోసం ఇజ్రాయెల్‌ వెపన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఐడబ్ల్యూఐ), అదానీ గ్రూప్‌ మధ్య.. 41వేల ‘నెగెవ్‌’ మెషిన్‌ గన్ల సరఫరాకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐడబ్ల్యూఐ, అదానీ గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన పీఎల్‌ఆర్‌ సిస్టమ్స్‌ ద్వారా గత వారంలో 2వేల ఎల్‌ఎంజీలను భారత్‌ అందుకుంది. ఈ ఏడాది చివరికల్లా మరో 4వేల ఎల్‌ఎంజీలను సరఫరా చేస్తామని ఐడబ్ల్యూఐ వెల్లడించింది. ఈ గన్లు కంప్యూటరైజ్డ్‌ సిస్టమ్‌కు అనుకూలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:34 AM