Share News

ఇరాన్‌కు చెక్‌ పెట్టేందుకు ‘ఐమెక్‌’ వ్యూహం!

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:42 AM

భారత్‌, పశ్చిమాసియా, యూరప్ లను రైలు, సముద్రమార్గాల ద్వారా కలిపే ‘భారత్‌- మిడిల్‌ఈస్ట్‌- యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌’ (ఐమెక్‌) ప్రాజెక్టుకు అమెరికా అధ్యక్షుడు తన పూర్తి మద్దతు ప్రకటించారు. పొరుగు దేశాల వాణిజ్య నౌకలపై ఇరాన్‌ జరుపుతున్న దాడులకు ఐమెక్‌ కారిడార్‌ ద్వారా చెక్‌ పెట్టవచ్చని వ్యాఖ్యానించారు

ఇరాన్‌కు చెక్‌ పెట్టేందుకు ‘ఐమెక్‌’ వ్యూహం!
Trump

  • భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌- యూరప్‌ కారిడార్‌కు మద్దతు: ట్రంప్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 23: భారత్‌, పశ్చిమాసియా, యూరప్ లను రైలు, సముద్రమార్గాల ద్వారా కలిపే ‘భారత్‌- మిడిల్‌ఈస్ట్‌- యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌’ (ఐమెక్‌) ప్రాజెక్టుకు అమెరికా అధ్యక్షుడు తన పూర్తి మద్దతు ప్రకటించారు. పొరుగు దేశాల వాణిజ్య నౌకలపై ఇరాన్‌ జరుపుతున్న దాడులకు ఐమెక్‌ కారిడార్‌ ద్వారా చెక్‌ పెట్టవచ్చని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు సందర్భంగా గల్ఫ్‌ దేశాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చమురు రవాణా వ్యవస్థకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ జలసంధిలో తరచూ రవాణాకు అంతరాయం కలుగుతుండటంతో, ఇంధన రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పదని ట్రంప్‌ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని ఇంధన రవాణా వ్యవస్థను ఇరాన్‌ గుప్పిట్లో నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే, తమ కార్యవర్గం ఐమెక్‌తోపాటు ఇతర పైప్‌లైన్‌ ప్రాజెక్టులను సమర్థిస్తోందని చెప్పారు.

Updated Date - Sep 24 , 2026 | 04:42 AM