Share News

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు

ABN , Publish Date - Jul 26 , 2026 | 07:50 AM

యెమెన్‌పై దాడులు చేసిన సౌదీపై తామూ ప్రతీకార దాడులు చేశామని హౌతీ మిలిటెంట్లు తాజాగా పేర్కొన్నారు.

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు
Houthis launches drones missile Attacks on Saudi Arabia

ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌పై దాడులు చేసిన సౌదీపై తామూ ప్రతీకార దాడులు చేశామని హౌతీ మిలిటెంట్లు తాజాగా పేర్కొన్నారు. హౌతీలకు ఇరాన్ మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. హొడీడా నగరంపై సౌదీ దాడులు చేసిందని హౌతీలు పేర్కొన్నారు. దీంతో, ఎర్ర సముద్రం తీరప్రాంత నగరాలైన యాన్బూ, జిజాన్‌లపై తామూ మిసైల్స్, డ్రోన్స్ ప్రయోగించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని అరామ్కో సంస్థ స్థావరాలపై దాడులు చేశామని చెప్పారు. అయితే, ఈ ప్రకటనపై సౌదీ ఇంకా స్పందించలేదు. ఆ నగరాల్లో మిసైల్ సైరెన్లు మోగినట్టు మాత్రం వార్తలు వెలువడ్డాయి.


రెండు వారాలుగా వరసపెట్టి ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా శుక్రవారం స్వల్ప విరామం ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిన్న (శనివారం) రాత్రి కూడా ఇరాన్‌పై ఎలాంటి దాడులు జరగలేదని సమాచారం. అయితే, ఇప్పటివరకూ పర్షియన్ గల్ఫ్‌కే పరిమితమైన ఘర్షణలు ప్రస్తుతం ఎర్ర సముద్రానికి కూడా పాకడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సరకు రవాణాకు ఎర్ర సముద్రం కూడా మరో ప్రధానమైన సముద్ర మార్గం అన్న విషయం తెలిసిందే. ఆసియా, ఐరోపా ఖండాల మధ్య సూయిజ్ కెనాల్-ఎర్రసముద్రం కీలక షిప్పింగ్ మార్గంగా ఉంది. ప్రపంచంలోని 12 శాతం వాణిజ్యం ఈ మార్గం మీదుగా సాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

హెచ్‌-1బీ వీసాలకు మూడేళ్ల విరామం!

యూకే కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు

Updated Date - Jul 26 , 2026 | 08:00 AM