ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై..
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:15 PM
ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్‌లను ప్రయోగించింది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. నిన్న రాత్రి రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్‌లతో విరుచుకుపడింది. నల్ల సముద్రం, అజోవ్ సముద్రం సహా రష్యా పరిధిలోని మొత్తం 12 ప్రాంతాలపై ఏకంగా 660 డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే, ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నట్టు రష్యా మరో ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో ఇదీ ఒకటని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్ల క్రితం యుద్ధం మొదలైంది. అయితే, ఇటీవల కాలంలో ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ ఆపరేషన్స్‌ను నిర్వహిస్తోంది. భారీ సంఖ్యలో డ్రోన్‌లను ప్రయోగిస్తూ రష్యాను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తోంది. రష్యాలోని భూభాగాల్లోకి చొచ్చుకెళ్లిన డ్రోన్ దాడులు చేస్తోంది. రష్యా చమురు రంగాన్ని దెబ్బతీసేలా ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడులు చేస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీసి నిధులు అందకుండా చేయాలని ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది.
శాంతిస్థాపనకు అమెరికా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు తగ్గాయి. అయితే, అమెరికా ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉక్రెయిన్ ఇలాంటి దాడులు చేస్తోంది. రష్యాపై 40 రోజుల ఇన్‌ఫ్లుయెన్స్ ఆపరేషన్ ప్రారంభించినట్టు ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇత తాజా దాడిలో రష్యాలోని ఒక రసాయనిక కర్మాగారం దెబ్బతిందని స్థానిక గవర్నర్ తెలిపారు. ఈ దాడిలో ఒక మహిళ గాయపడింది.
ఈ వార్తలనూ చదవండి:
వెనెజువెలాలో శిథిలాల మధ్య బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..
వెనెజువెలా భూకంపాలు.. 41 వేల మందికి పైగా గల్లంతు.. 250 మంది మృతి..