ఫ్రాన్స్‌లో వడగాలులు.. 1000 మంది మృతి
ABN , Publish Date - Jun 28 , 2026 | 07:55 PM
ఫ్రాన్స్‌లో వడగాలుల కారణంగా జూన్ 24 నుంచి ఆదివారం వరకూ 1000 మంది మరణించారని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రభుత్వ అంచనాలకు మించి ఈ అదనపు మరణాలు సంభవించాయని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: భానుడి భగభగలకు ఫ్రాన్స్ అల్లాడుతోంది. వడగాలుల కారణంగా జూన్ 24 నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వ అంచనాను మించి అదనంగా 1000 మంది మరణించారని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. మృతుల్లో 85 శాతం మంది 65 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారని తెలిపారు. వేడిని తట్టుకోలేక అనేక మంది తమ ఇళ్లల్లోనే కన్నుమూశారని కూడా అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈసారి ఫ్రాన్స్‌లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వారంలో ఫ్రాన్స్‌లో పలుమార్లు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటాయి. అయితే, ఆదివారం ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు ఐరోపా కూడా భానుడి భగభగలతో అల్లాడిపోయింది. పలు దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారాంతంలో జర్మనీ, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్ ఆల్ టైమ్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్విట్జర్‌లాండ్‌లో ఈ జూన్ నెల ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన మాసంగా నిలిచింది. ఈ స్థాయి వడగాలులు, ఉష్ణోగ్రతలకు మానవకార్యకలాపాలే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్ ప్రైవేట్ స్పేస్‌లో రహస్య చీటీలు.. నటాలీ హార్ప్‌పై సంచలన ఆరోపణలు!
ఘోర విమాన ప్రమాదం.. 11 మంది మృతి